News March 21, 2024

మెట్పల్లి: పెళ్లి భోజనాల్లో గొడవ.. కేసు నమోదు

image

వివాహ వేడుక భోజనాల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిన్న మధ్యాహ్నం భోజనాల విషయంలో పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారునికి సంబంధించిన బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. పలువురు గాయాలపాలయ్యారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు మొత్తం 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 17, 2024

ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి పొన్నం

image

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి,
సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2024

KNR: అనుమానాస్పద స్థితిలో సింగరేణి ఉద్యోగి మృతి

image

గోదావరిఖని జీఎం కాలనీ సింగరేణి కార్మికుడు హరినాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న జీడీకే-1 ఇంక్లైన్‌కి చెందిన బానోతు హరినాథ్ సింగ్ తన క్వార్టర్లో మృతి చెందాడు. అయితే మృతుడి మెడపై గాయాలు ఉండటంతో.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2024

కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న నిమజ్జనం

image

మానకొండూరు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి పెద్ద చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చేయగా, మానకొండూరులో తెల్లవారుజాము వరకు నిమజ్జనం ఉత్సవాలు జరిగాయి. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన వినాయక నిమజ్జనం ఉత్సవాలు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాకుండా తిమ్మాపూర్ మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల ప్రతిష్టించిన విగ్రహాలు మానకొండూర్ చెరువులోనే నిమజ్జనం చేశారు.