News March 27, 2025
మెట్పల్లి: ‘ప్రతి మత్స్య కార్మికుడు ఇన్సూరెన్స్ సౌకర్యం పొందాలి’

ప్రతి ఒక్క మత్స్య కార్మికుడు ఇన్సూరెన్స్ సౌకర్యం పొందాలని జిల్లా సహకార సంఘం అధికారి మనోజ్ కుమార్ అన్నారు. మెట్పల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ సహకార సంవత్సరం -2025 సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస్, అధికారులు ఉన్నారు.
Similar News
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <
News September 18, 2025
HYD: నల్లాబిల్లు కట్టాలని క్రెడిట్‌కార్డు ఖాళీ చేశాడు!

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో డబ్బు కాజేస్తున్నారు. పెండింగ్ నల్లా బిల్లు చెల్లించాలని ఆన్లైన్ లింక్ పంపి ఓ వ్యక్తి నుంచి రూ.95,237 కాజేశారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీవాసి సంకలమద్ది శ్రీనివాస్ రెడ్డికి SEPT 11న వాటర్ బోర్డుకు బిల్లు చెల్లించాలని 6303323494 నుంచి వాట్సప్ లింక్ పంపాడు. ఈనెల బిల్ చెల్లించలేదని, నిజమేనని నమ్మి APK ఫైల్ ఇన్స్టాల్ చేయగా క్రెడిట్ కార్డు కాళీ అయింది.
News September 18, 2025
ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్‌గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్‌గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.