News August 14, 2024

మెట్‌పల్లి: బాలుడి కిడ్నాప్.. 18 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

image

మెట్ పల్లి పట్టణంలోని ఓ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కాగా, పోలీసులు 18 గంటల్లోనే కేసును ఛేదించారు. నిన్న కిడ్నాప్ జరిగిన సమయం నుంచి పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీ కనుగొన్నారు. బాలుడిని అమ్మక్కపేట శివారులోని అర్బన్ కాలనీ వద్ద కిడ్నాపర్ వదిలి వెళ్లిపోయాడు. పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News October 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో ఎస్సారెస్పీ కాలువలో పడి రైతు మృతి.
@ బెజ్జంకి మండలంలో మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్య.
@ సిరిసిల్ల ప్రజావాణిలో 82 ఫిర్యాదులు.
@ జగిత్యాల ప్రజావాణిలో 25 ఫిర్యాదులు.
@ హుజురాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కూడా సాగుతున్న దుర్గ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు.
@ మెట్పల్లి పట్టణంలో తప్పిపోయిన బాలుడి అప్పగింత.

News October 7, 2024

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఘనంగా మహాలింగార్చన

image

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మహా లింగార్చన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రిత్వచ్ఛారణల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాలింగ అర్చన చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని మహాలింగార్చన ప్రమిదలను వెలిగించారు. మహా లింగార్చన కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

News October 7, 2024

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: MLA గంగుల

image

జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల రద్దుపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గంగుల బహిరంగ లేఖ రాశారు. జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు.‌ ఎన్నికల్లో చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయిస్తారా? అని పేర్కొన్నారు. దసరాకు జర్నలిస్టుల కుటుంబాల్లో పండగ లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.