News August 14, 2024

మెట్‌పల్లి: బాలుడి కిడ్నాప్.. 18 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

image

మెట్ పల్లి పట్టణంలోని ఓ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కాగా, పోలీసులు 18 గంటల్లోనే కేసును ఛేదించారు. నిన్న కిడ్నాప్ జరిగిన సమయం నుంచి పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీ కనుగొన్నారు. బాలుడిని అమ్మక్కపేట శివారులోని అర్బన్ కాలనీ వద్ద కిడ్నాపర్ వదిలి వెళ్లిపోయాడు. పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News September 8, 2024

కరీంనగర్: గణనాథుని దర్శించుకున్న మంత్రి పొన్నం

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రకాశం గంజి వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో తొలి పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. విగ్నేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజించాలని గణేష్ ని ఆశీస్సులతో ప్రజా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు కలెక్టర్ పమెలా సత్పతి కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

News September 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

☛VMWD: మండపాన్ని సిద్ధం చేస్తున్న కూలీలకు విద్యుత్ షాక్.. ఇద్దరికీ గాయాలు ☛PDPL: ఎల్లమ్మ చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య ☛SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు అరెస్టు ☛HZB: వినాయక మండపంలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి ☛HZB: భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్ ☛కోరుట్ల: విద్యుత్ షాక్ తో మహారాష్ట్ర కూలి మృతి ☛GDK: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య.

News September 7, 2024

పెద్ద‌పల్లి‌లో యువకుడి ఆత్మహత్య..

image

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లికి చెందిన జంపయ్య శనివారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినాయక చవితి పండుగ పూట ఎల్లమ్మ చెరువులో జంపయ్య దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో, ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. జంపయ్య మృతికి గల కారణాలు తెలియ రాలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.