News March 27, 2025

మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు ఇలా

image

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి.. పసుపు కాడి క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 9,109, గరిష్ఠ ధర రూ. 13,151లుగా పలికాయి. పసుపు గోళ కనిష్ఠ ధర రూ. 8,888, గరిష్ఠ ధర రూ. 11,802, పసుపు చూర కనిష్ఠ ధర రూ. 8,885, గరిష్ఠ ధర రూ. 9,700లుగా పలికాయి. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి వివరాలు వెల్లడించారు.

Similar News

News February 23, 2026

వంటింటి చిట్కాలు

image

* ఫ్రిడ్జ్‌లో వాసన వస్తుంటే.. ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది. * బంగాళదుంప ముక్కలను మజ్జిగలో నానబెట్టి ఫ్రై చేస్తే అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి. * దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, కందిపప్పు, స్పూను చొప్పున మెంతులు, అటుకులు వేయాలి. * ఫర్నిచర్, వంట పాత్రలపై ఉండే స్టిక్కర్లను తీయడానికి దాని మీద నూనె వేసి రుద్ది, పావుగంటయ్యాక సబ్బుతో కడగాలి.

News February 23, 2026

రామచంద్రపురం: గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ

image

HYD నుంచి గోవాకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించిందని డిపో మేనేజరు తెలిపారు. ఈనెల 25న BHEL నుంచి బయలుదేరే ఈ బస్సు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఉడిపి, మురుడేశ్వర్ ఆలయాల మీదుగా గోవాకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణం మార్చి 1న ఉదయం 6 గంటలకు గోవా నుంచి MGBS మీదుగా లింగంపల్లికి చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించారు.

News February 23, 2026

పెళ్లి ముసుగులో మోసం.. అమ్మాయిలూ జాగ్రత్త: సజ్జనార్

image

TG: HYDలో పెళ్లి పేరుతో పెరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని CP సజ్జనార్ తెలిపారు. నిశ్చితార్థమయ్యాక శారీరకంగా దగ్గరవుతున్నారని, ఆ తర్వాత భారీగా కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రేమ పేరుతోనే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పారు. ఈ మోసాలపై యువతులు షీ టీమ్స్ వాట్సాప్(9490616555), డయల్ 100కి ఫిర్యాదు చేయవచ్చన్నారు.