News March 29, 2025
మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు..

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 12,566, కనిష్ఠ ధర రూ. 9,211, పసుపు గోళ గరిష్ఠ ధర రూ. 11,888, కనిష్ఠ ధర రూ. 9,051, పసుపు చూర గరిష్ఠ ధర రూ. 9,452, కనిష్ఠ ధర రూ. 8,183లుగా పలికాయి. కాగా ఈ సీజన్లో మొత్తం కొనుగోళ్ళు 36,557 క్వింటాళ్లు కాగా, ఈ రోజు 325 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయి.
Similar News
News April 3, 2025
BNG: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపా ధికల్పన అధికారి సాహితి తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic.వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
News April 3, 2025
NZB: LRS గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

LRS రిబేట్ గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జిల్లా ప్రజలకు సూచించారు. అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన LRS 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించిందని తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం పొడిగించిందన్నారు.
News April 3, 2025
ట్రంప్ టారిఫ్స్: అత్యధికంగా ఈ దేశాలపైనే

* సెయింట్ పిర్రే అండ్ మిక్‌లెన్- 50%
* లెసోతో-50%
* కాంబోడియా- 49%
* లావోస్-48% *మడగాస్కర్-47%
* వియత్నాం-46%
* శ్రీలంక-44% *మయన్మార్-44%
* సిరియా- 41% * ఇరాక్-39%
*బంగ్లాదేశ్-37% * చైనా-34% *పాకిస్థాన్-29%
>>ఇండియాపై 26%