News April 3, 2025
మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర ఇలా

జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పసుపు ధర ఈవిధంగా ఉన్నాయి. ఈరోజు పసుపు కాడి గరిష్ఠ ధర రూ.14,395, కనిష్ఠ ధర రూ.9,009, పసుపు గోళం గరిష్ఠ ధర రూ.13,556, కనిష్ఠ ధర రూ.8,888 పసుపు చూర గరిష్ఠ ధర రూ.10,445, కనిష్ఠ ధర రూ.9,292గా పలికిందని కార్యదర్శి తెలిపారు. ఈరోజు మొత్తం 1783 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
భూపాలపల్లిలో పువ్వుల పండుగ జరిగేది ఇక్కడే..!

ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలకు భూపాలపల్లి జిల్లా సిద్ధం అవుతోంది. రసంకుంట(గోరి కొత్తపల్లి), గణపేశ్వరాలయం(గణపసముద్రం), మామిడి కుంట చెరువు(చిట్యాల), దామెర చెరువు(రేగొండ), నైన్పాక ఆలయం(చిట్యాల), అయ్యప్ప దేవాలయం(కాటారం), టెకుమట్ల చెరువు, కాళేశ్వరం(మహదేవపూర్)తో పాటు పలిమెల, మల్హర్ మండలాల్లోని పలు చోట్ల వేడుకలు ఘనంగా జరుగుతాయి. మీ గ్రామంలో వేడుకలు ఎక్కడ జరుగుతాయో లొకేషన్ కామెంట్ చేయండి.
News September 18, 2025
పాలమూరు RTCలో ఉద్యోగాలు

సుదీర్ఘ విరామం తర్వాత <<17746081>>ఆర్టీసీలో ఉద్యోగాల<<>> భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి MBNR రీజియన్లో ఖాళీలు ఇలా ఉన్నాయి. MBNRలో డ్రైవర్ 20, శ్రామిక్ పోస్టులు 5, NGKLలో డ్రైవర్ 20, శ్రామిక్ 2, GWLలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, WNPలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, NRPTలో డ్రైవర్ 13, శ్రామిక్ 3 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
-SHARE IT
News September 18, 2025
తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.