News March 8, 2025

మెట్ పల్లి: ఆరోగ్య సమస్యలతోనే నవవరుడు ఆత్మహత్య

image

మెట్‌పల్లి మండలం వెల్లుల్ల అనుబంధ గ్రామం రామచంద్రంపేటలో లక్కంపల్లి కిరణ్ అనే<<15688708>> నవ వరుడు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. రేపు అతని పెళ్లి జరగాల్సి ఉండగా ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా తమకు చెప్పలేదని పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని భావించి సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News July 11, 2025

కృష్ణా: ‘ఈనెల 14 లోపు పాఠశాలలకు హాజరు కావాలి’

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్లు భర్తీ చేయడానికి నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేశామని సమన్వయ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ ఆధారంగా సీట్లు పొందిన విద్యార్థులకు ఇప్పటికే ఫోన్ ద్వారా సమాచారం అందించామన్నారు. ఈ నెల 14వ తేదీలోగా వారందరూ అన్ని ధ్రువీకరణ పత్రాలతో గురుకుల పాఠశాలలో హాజరు కావాలని సూచించారు.

News July 11, 2025

GNT: యువతకు ముఖ్య గమనిక

image

తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 14న అప్రెంటిస్ మేళా జరగనుంది. ఉదయం 10.30 గంటలకు మేళా ప్రారంభమవుతుంది. అనేక ప్రైవేట్ కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. ఐటీఐ పూర్తి చేసిన యువత బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని ప్రిన్సిపల్ చిన్న వెంకటేశ్వర్లు సూచించారు. ఉపాధి అవకాశాల కోసం మేళాను ఉపయోగించుకోవాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.

News July 11, 2025

త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

image

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.