News January 24, 2025
మెట్ పల్లి: కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ అరవింద్

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను గురువారం ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు మొరపల్లి సత్యనారాయణ రావు, జాతీయ పసుపు బోర్డు మొదటి చైర్మన్ పల్లె గంగారెడ్డి తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.
Similar News
News February 11, 2025
ఏ బీరుపై ఎంత రేటు పెరిగిందంటే?

TG: రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ్టి నుంచి 15% పెరిగాయి. KF స్ట్రాంగ్ రేటు రూ.160 నుంచి రూ.184కు, లైట్ రూ.150 నుంచి రూ.172కు, అల్ట్రా మాక్స్ రూ.220 నుంచి రూ.253కు చేరాయి. అలాగే బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241కు, మ్యాగ్నం రూ.220 నుంచి రూ.253కు, టుబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.
News February 11, 2025
షీలానగర్-పోర్టు రోడ్డులో యాక్సిడెంట్

షీలానగర్-పోర్టు రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాకకు చెందిన ఎం.నరసింహారావు సైకిల్‌పై టీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం టీ పట్టుకొని వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు.
News February 11, 2025
పాడేరు: యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

బుధవారం జరగాల్సిన(రేపు) ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను యథావిధిగా కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ మంగళవారం తెలియజేశారు. అయితే ఈనెల 11వ తేదీన రద్దు చేసిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని చెప్పారు. >Share it