News February 15, 2025
మెడికల్ కళాశాల సందర్శించిన కలెక్టర్ దినేష్ కుమార్

అల్లూరి జిల్లా పాడేరు మెడికల్ కళాశాలను కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం సందర్శించారు. అనాటమీ, వయ కెమిస్ట్రీ, హిస్టాలజీ ల్యాబ్ బోధనా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో సామాజిక సేవ క్లబ్, సాంస్కృతి కార్యక్రమాల క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ 1 ఏప్రిల్లోను, బ్లాక్ 2 ఆగస్టు, బ్లాక్ 3 జూన్లోను పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్కు తెలిపారు.
Similar News
News October 21, 2025
సిద్దిపేట: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

అక్కన్న పేట మండలంలోని అంతక్కపేట గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కె.హైమావతి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తేమశాతం రాగానే గన్నిలలో నింపి లారీలలో లోడ్ చేయాలని, సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉండాలన్నారు. తూకంలో ఎలాంటి తేడా రావద్దని సెంటర్ సిబ్బందికి తెలిపారు. గన్ని బ్యాగులు ప్రతిరోజూ చెక్ చేసుకుని డ్యామేజ్ ఉంటే అధికారులకు రిపోర్ట్ చేయాలన్నారు.
News October 21, 2025
నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – వాటిని గుర్తించే విధానం

భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు.. విత్తన కుళ్లు, మొలక మాడు, నారు కుళ్లు, వేరు కుళ్లు, మొదలు కుళ్లు, కాండం కుళ్లు, తల కుళ్లు. పంటలో ఈ తెగుళ్లను ముందే గుర్తించేందుకు పొలంలో వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలను ఎన్నుకొని, పీకి మెల్లగా మట్టిని తొలగించి శుభ్రం చేయాలి. అప్పుడు వేరు, భూమిలో ఉండే కాండం భాగాల్లో ఏదైనా రంగు మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఏదైనా మార్పు కనిపిస్తే అది వ్యాధి తొలి లక్షణంగా గుర్తించాలి.
News October 21, 2025
నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు సూచనలు

వేసవి దుక్కులను నిర్లక్ష్యం చేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని ఆచరించాలి. భూమి నుంచి మురుగు నీరు బయటకుపోయేట్లు చూడాలి. వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలను మొక్కలకు అందించాలి. సమగ్ర నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలి. కలుపు మొక్కల నిర్మూలన చేపట్టాలి. విత్తన శుద్ధి తప్పక చేయాలి. జీవ నియంత్రణ పద్ధతులను పాటించాలి. తెగుళ్ల లక్షణాలను గుర్తించిన వెంటనే నిపుణుల సూచనలతో నివారణ మందులను తప్పక పిచికారీ చేయాలి.