News February 15, 2025
మెడికల్ కళాశాల సందర్శించిన కలెక్టర్ దినేష్ కుమార్

అల్లూరి జిల్లా పాడేరు మెడికల్ కళాశాలను కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం సందర్శించారు. అనాటమీ, వయ కెమిస్ట్రీ, హిస్టాలజీ ల్యాబ్ బోధనా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో సామాజిక సేవ క్లబ్, సాంస్కృతి కార్యక్రమాల క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ 1 ఏప్రిల్‌లోను, బ్లాక్ 2 ఆగస్టు, బ్లాక్ 3 జూన్‌లోను పూర్తి చేస్తామని ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.
Similar News
News March 17, 2026
GNT: రూ.10 కోట్లతో ఫైనాన్స్ యజమాని పరార్

లక్ష పెడితే నెలకు రూ. 10 వేల లాభమంటూ నమ్మించిన ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని వందల మందికి టోకరా వేశాడు. గుంటూరు అరండల్‌పేటలో ‘ట్రేడ్ దోస్త్’ పేరుతో సంస్థ నడిపిన బాపట్లకు చెందిన వెంకట పూర్ణచంద్రరావు.. ఏజెంట్ల ద్వారా సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
News March 17, 2026
పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. లయన్స్ క్లబ్, క్రెడాయి సభ్యుడైన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు హైదరాబాద్‌లో చదువుకుంటున్న కూతురు రిషిత వద్దకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టగా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. జంట మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.
News March 17, 2026
రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.


