News August 3, 2024
మెడికల్ కాలేజీకి భూమి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం

ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజీకి భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రఘునాథపాలెంలో 35ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. అధునాతన సౌకర్యాలతో అన్ని భవన నిర్మాణాలు సత్వరమే చేపట్టి, వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
Similar News
News October 24, 2025
మైనారిటీ వృత్తి శిక్షణకు సంస్థల దరఖాస్తుల ఆహ్వానం

మైనారిటీలకు ఉద్యోగావకాశాలు కల్పించే వృత్తి నైపుణ్య శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం. ముజాహిద్ తెలిపారు. గవర్నమెంట్ నైపుణ్యాభివృద్ధి సంస్థలతో అనుసంధానమైన ట్రైనింగ్ పార్ట్నర్ సంస్థలు నవంబర్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలు, ఆడిట్ రిపోర్టులు జతపరచాలన్నారు.
News October 23, 2025
పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గురువారం కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్ధలం సంబంధించి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీపీ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
News October 23, 2025
ఖమ్మం: మద్యం టెండర్లకు మంచి స్పందన

ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభించింది. గురువారం(నేటి)తో దరఖాస్తు గడువు ముగుస్తుండగా, వ్యాపారులు తీవ్రంగా పోటీ పడ్డారు. జిల్లాలోని 116 షాపులకు బుధవారం వరకు ఏకంగా 4,177 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో దరఖాస్తులు మరింత భారీగా దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.