News March 20, 2024
మెడికల్ కాలేజీలో 38 వైద్యుల పోస్టులు భర్తీ
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 38 వైద్యుల పోస్టులు భర్తీ చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజేశ్వరరావు తెలిపారు. ఇందులో 32 మంది మంగళవారం విధుల్లో చేరారని పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 15న జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నియామకాలతో కొంత మేర వైద్యుల కొరత తీరినట్లేనని, ఎన్నికలు ముగిశాక పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామన్నారు.
Similar News
News September 12, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు
✓ భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ✓ తాలిపేరు ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ✓ అశ్వారావుపేటలో బీభత్సం సృష్టించిన దొంగలు ✓ అధికారులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి తుమ్మల ✓ ఖమ్మం: నిమర్జన ఏర్పాటును పరిశీలించిన సీపీ సునీల్ దత్ ✓ కూసుమంచిలో కేంద్ర బృందం పర్యటన ✓ ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్య: డిప్యూటీ సీఎం ✓ కారేపల్లి: సీఎం సహాయనిధి చెక్కు అందించిన మంత్రి పొంగులేటి
News September 11, 2024
KMM: పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష
పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులను సీజన్ ప్రారంభానికి ముందే సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కనిష్ట మద్దతు ధర, పత్తి సేకరణ మార్గదర్శకాల గురించి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు వారానికి 6 రోజులు పనిచేయాలని సూచించారు.
News September 11, 2024
భద్రాచలం: గంట గంటకు తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు తగ్గుతూ వస్తుందని సీడబ్ల్యూసీ అధికారులు బుధవారం సా.6 గంటలకు ప్రకటించారు. గోదావరి నీటిమట్టం 48.7 అడుగులకు తగ్గిందని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పడటంతో వరద ప్రవాహం తగ్గుతుందని తెలిపారు. కాగా గణేష్ నిమజ్జనం గోదావరిలో కొనసాగడంతో జిల్లా పోలీసు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వరద ప్రవాహం తగ్గుతుండడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.