News November 13, 2024
మెడికల్ హాల్స్, ఫార్మసీల్లో తనిఖీలు: రాజనర్సింహ

నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని అమ్మేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్నారు.
Similar News
News January 19, 2026
మెదక్: ‘బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే’

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల వాటా, ఆత్మగౌరవం కోసం పోరాడుతామన్నారు. త్వరలోనే మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ‘సామాజిక న్యాయ సభ’ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
News January 19, 2026
మెదక్: 346 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు!

మెదక్ పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ జరిగింది. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని 346 సంఘాలకు రూ. 90.24 లక్షల చెక్కులతో పాటు చీరలను అందజేశారు. మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రుణాలను చిన్న వ్యాపారాలు, పిల్లల చదువుల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
News January 19, 2026
మెదక్: పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

మెదక్ మండలం రాజ్‌పల్లిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు తన పింఛన్ డబ్బులు, బంగారం ఇవ్వలేదన్న కోపంతో చాకలి రాములు తన కన్నతల్లి నరసమ్మను కట్టెతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై లింగం సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


