News April 24, 2024
మెతుకు సీమలో నెగ్గేదెవరో..?
ఓవైపు నామినేషన్ల, మరోవైపు ప్రచార పర్వం ఊపందుకోవడంతో మెదక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రముఖుల రాకతో క్యాడర్‌లో జోష్ నింపింది. ప్రత్యేక రాష్ట్రంలో 2014, 19 ఎన్నికల్లో గెలిచిన BRS హ్యాట్రిక్ పై కన్నేసింది. పవర్‌లో ఉన్న కాంగ్రెస్ గెలుపు వ్యూహాలతో ముందుకెళ్తూ సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టాగా అటూ మోదీ నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు తమకే మద్దతిస్తారని ధీమాలో BJP ఉంది. గెలుపు ఎవరిదో చూడాలి.
Similar News
News January 20, 2025
మెదక్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: మంత్రి
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని విమెన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే నర్సింగ్ కాలేజీ కూడా ప్రారంభించామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారని, వారందరి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు.
News January 19, 2025
డబ్బా కొట్టడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి: హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలపై ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారూ.. మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని తెలిపారు. ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన మీకు చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
News January 18, 2025
BREAKING.. మెదక్: అన్నను చంపిన తమ్ముడు
మెదక్ జిల్లా శివంపేట మండలం నాను తండాలో తమ్ముడు అన్నను హత్య చేశాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన అన్నదమ్ములు శంకర్ (28), గోపాల్ రాత్రి ఒకే రూంలో పడుకున్నారు. తెల్లవారుజామున అన్న కాలికి కరెంట్ వైర్ చుట్టి విద్యుత్ షాక్ పెట్టాడు. శంకర్ కేకలు వేయడంతో గోపాల్ పారిపోయాడు. తండ్రి వచ్చి చూసే వరకే శంకర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.