News August 27, 2024

మెత్తటి మాటలతో మోసం చేశారు: ఎమ్మెల్యే తాటిపర్తి

image

ఎన్నికల ప్రచారంలో మెత్తటి మాటలతో పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ‘పాత పెన్షన్ పథకాన్ని (OPS) పునరుద్ధరిస్తాం, CPSను రద్దు చేస్తామని ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. OPS పునరుద్ధరించడం అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త UPS విధానంపై మీ నిర్ణయం ఏంటి..?’ అని ‘X’ వేదికగా ప్రశ్నించారు.

Similar News

News December 20, 2025

ఒంగోలులో రూ.40వేల వేతనంతో జాబ్స్..!

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు చెప్పారు. 10th నుంచి ఏదైనా డిగ్రీ చదివిన 18-35 ఏళ్లలోపు వయస్సు గలవారు అర్హులు. జీతం రూ.40వేల వరకు పొందే అవకాశం ఉందన్నారు.

News December 20, 2025

ప్రకాశం: మీకు ఈ కార్డులు అందాయా..?

image

ప్రకాశం జిల్లాలో ఇంకా కొందరు వివిద కారణాలతో తీసుకోని 38408 స్మార్ట్ రేషన్ కార్డులు అలానే ఉన్నాయన్నది అధికారిక లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోకపోతే వెనక్కి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News December 20, 2025

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే టాక్.!

image

ప్రకాశం పాలి’ ట్రిక్స్’లో ఎప్పుడు ఏ ప్రచారం జరుగుతుందో ఊహించడం కష్టమే. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో రోజుకొక ప్రచారం సాగుతోంది. ఇటీవల బాలినేని గురించి ప్రకాశంలో తీవ్ర చర్చ సాగుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ప్రచారం ఉండగా, అంతకు ముందు బాలినేనికి MLC పదవి వరించనుందని టాక్. ఇదే ప్రచారం బాలినేని జనసేనలోకి వెళ్లిన సమయంలోనూ సాగడం విశేషం.