News May 2, 2024
మెదక్‌కు బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కల్పిస్తా: రేవంత్

సిద్దిపేటలో మామపోతే అల్లుడు అన్నట్టుగా హరీశ్ రావు రాజ్యం ఏలుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మరోవైపు నిజాం వద్ద కాశీం మాదిరిగా కేసీఆర్ వద్ద వెంకట్రావ్ పని చేశారని విమర్శించారు. అందుకే మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. దొరల గడీలను బద్దలు కొట్టకపోతే బానిసల అవుతామని చెప్పారు. మెదక్‌ను బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కల్పిస్తానని అన్నారు.
Similar News
News October 26, 2025
మెదక్: ‘పది రోజుల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌పై కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సమీక్షించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఆయన తహశీల్దార్లు, ఆర్డీఓలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల తర్వాత దరఖాస్తులను తప్పకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
News October 26, 2025
రామాయంపేట: GREAT.. 56వ సారి రక్తదానం

రామాయంపేట పట్టణానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56వ సారి రక్తదానం చేశారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 56వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఎస్పీ అభినందించారు.
News October 26, 2025
అమర వీరుల త్యాగాలు వృథా కావు: ఎస్పీ శ్రీనివాసరావు

పోలీస్ అమర వీరుల త్యాగాలు ఎప్పటికీ వృథా కావని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


