News February 21, 2025

మెదక్‌లో గ్రాడ్యుయేట్స్ 12,472, టీచర్స్ 1,347 ఓటర్లు

image

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 12,472 ఉన్నారు. ఇందులో 8,879 మంది పురుషులు, 3,593 మహిళలున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,347 ఉన్నారు. ఇందులో పురుషులు 7,99 మంది, మహిళలు 5,48 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News February 23, 2025

మెదక్: ఏడుపాయల జాతర నిధులకు ఎన్నికల కోడ్!

image

మెదక్ జిల్లాలో పవిత్రమైన ఏడుపాయల జాతర నిధులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారనుంది. ఈనెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జాతర జరగనుంది. జాతరకు సుమారుగా 15 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వం రెండు కోట్లను మంజూరు చేస్తుంది. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది.

News February 23, 2025

మెదక్: ఎమ్మెల్సీ ఎన్నికలు, ఏడుపాయల జాతరపై ఎస్పీ సమీక్ష

image

27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్త్, ఏడుపాయల జాతరపై మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు బందోబస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద పరిస్థితుల వివరాలను సేకరించాలన్నారు. మెదక్ జిల్లాలో 21 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని, వాటికీ ఆయుధాలు కలిగిన 8 రూట్ మొబైల్ పార్టీలు విధులు నిర్వహిస్తాయన్నారు. జాతర కోసం సూచనలు చేశారు.

News February 23, 2025

MLC స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి CMకు గిఫ్ట్ ఇవ్వాలి: మంత్రి

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్‌గా ఇవ్వాలని మంత్రి దామోదర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ తర్వాతా మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు.

error: Content is protected !!