News February 21, 2025

మెదక్‌లో గ్రాడ్యుయేట్స్ 12,472, టీచర్స్ 1,347 ఓటర్లు

image

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 12,472 ఉన్నారు. ఇందులో 8,879 మంది పురుషులు, 3,593 మహిళలున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,347 ఉన్నారు. ఇందులో పురుషులు 7,99 మంది, మహిళలు 5,48 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News March 23, 2025

మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

image

అప్పుల బాధతో రైతు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల(50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 23, 2025

మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

image

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. భర్త భూపతి బంధువుల ఇంట్లో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 23, 2025

మెదక్: ఇంటర్ విద్యార్థి MISSING

image

మెదక్ జిల్లా శివంపేట మండలం దంతాన్ పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. దంతాన్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల రేవంత్ కుమార్(17) శనివారం పొలం వద్దకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్ఐ వివరించారు. మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి గొల్ల మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి పేర్కొన్నారు.

error: Content is protected !!