News April 27, 2024

మెదక్‌లో బీజేపీ మాకు పోటీయే కాదు: నీలం మధు

image

మెదక్‌లో బీజేపీ మాకు పోటీయే కాదని కాంగ్రెస్ MP అభ్యర్థి నీలం మధు అన్నారు. శనివారం దుబ్బాకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం మధు మాట్లాడుతూ.. రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాక చేసింది ఏమీలేదని విమర్శించారు. ఆయన మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు.

Similar News

News November 27, 2025

నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూడాలి: SP

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. హవేలిఘనపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల పురస్కరించుకొని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేందుకు, నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరిగేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

News November 26, 2025

మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

image

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.