News April 27, 2024

మెదక్‌లో బీజేపీ మాకు పోటీయే కాదు: నీలం మధు

image

మెదక్‌లో బీజేపీ మాకు పోటీయే కాదని కాంగ్రెస్ MP అభ్యర్థి నీలం మధు అన్నారు. శనివారం దుబ్బాకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం మధు మాట్లాడుతూ.. రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాక చేసింది ఏమీలేదని విమర్శించారు. ఆయన మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు.

Similar News

News April 19, 2026

మెదక్: ఇంటికి చేరాలి.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కోసం రూపొందించిన “ఇంటికి చేరాలి…” అనే షార్ట్ ఫిల్మ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక “సురక్షిత ప్రయాణం” కార్యక్రమంలో భాగంగా రూపొందిన ఈ చిత్రం యువతలో మార్పు తీసుకురావడమే లక్ష్యంమని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, జరిమానాలు, శిక్ష కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసం అనే సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.

News April 19, 2026

మెదక్: ఏప్రిల్ 20 నుంచి సంక్షేమ వారం: కలెక్టర్

image

ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించినట్లు కలెక్టర్‌ ప్రతిమా సింగ్ తెలిపారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు జరిపించాలన్నారు.