News March 13, 2025
మెదక్లో మహిళలు మిస్..

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.
Similar News
News March 14, 2025
‘ఆపదమిత్ర’ అమలుపై కలెక్టర్ సమీక్ష

మెదక్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపదమిత్ర పథకం అమలుపై వివిధ శాఖల ద్వారా వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్స్ గుర్తింపుపై, జిల్లా యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఓ, మెప్మా, హెల్త్, రెవిన్యూ, ఫైర్, మత్స్య శాఖ, ఇండస్ట్రీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ భుజంగరావు కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
News March 14, 2025
సంప్రదాయాలు పాటిస్తూ హోళీ జరుపుకోవాలి: కలెక్టర్

సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకోవాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సమానత్వానికి ప్రతీకని, ఈ రంగుల పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించేలా మారాలని, ఆనందంగా, భద్రతతో, జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోలీ ఆడిన తదుపరి బావులు, వాగులు, చెరువులు, గోదావరిలో స్నానాలకు వెళ్ళొద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
News March 14, 2025
మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాగ ద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషం వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీని జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.