News August 28, 2024
మెదక్: అక్రమ నిర్మాణాలు కూల్చేయండి !

ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల చెరువులు కబ్జాకు గురయ్యాయి. HYDలో హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో ఉమ్మడి జిల్లాలోనూ ఇలాంటి వ్యవస్థను తెచ్చి కబ్జాకు గురైన ప్రాంతాల్లో నిర్మాణాలు కూల్చివేయాలనే డిమాండ్ వస్తుంది. మెదక్‌లోని మల్లెం చెరువు, హెచ్ఎండీఏ పరిధిలోని పటాన్చెరు, జిన్నారం, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని మండలాల్లోని పలు చెరువులు, ప్రాంతాలు కబ్జాకు గురయ్యాయి.
Similar News
News November 6, 2025
అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు గురువారం తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటిన అనంతరం ఆయన సిబ్బంది పరేడ్‌ను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్ బాక్స్‌లను స్వయంగా తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కిట్ ఆర్టికల్స్ నిర్వహణలో పరిశుభ్రత, శ్రద్ధ కనబరిచిన కానిస్టేబుల్ జితేందర్‌కు అభినందించి రివార్డును మంజూరు చేశారు.
News November 6, 2025
టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నేతలు

టీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం గురువారం ప్రగతి రిసార్ట్స్‌లో జరిగింది. ఈ సమావేశంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు ఏ. శంకర్ దయాళ్ చారి, ప్రధాన కార్యదర్శి ఏ. సంతోష్ కుమార్ పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. జర్నలిస్టుల సమస్యలు, హక్కులు సహా పలు అంశాలపై చర్చించారు.
News November 6, 2025
మెదక్: అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవినీతి జాడ్యాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రతి రోజు అవినీతి డబ్బుతో ఏసీబీకి దొరకడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అధికారులు, సిబ్బంది బాధ్యత అన్నారు.


