News April 24, 2024

మెదక్: అత్తను దారుణంగా కొట్టి చంపిన అల్లుడు

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్‌పల్లి కలాన్ గ్రామానికి చెందిన సూది కౌసవ్వ(50) హత్యకు గురైంది. ఆమె కూతురు శోభకు మెదక్ పట్టణానికి చెందిన మురాటి దశరథ(35)తో పెళ్లైంది. దంపతుల మధ్య గొడవలతో శోభ HYDలో అన్నావదిన వద్ద ఉంటోంది. కాగా భార్య కాపురానికి రాకపోవడానికి అత్త కౌసవ్వ కారణమని భావించిన దశరథ.. సోమవారం రాత్రి శెట్ పల్లికలాన్ వచ్చి అత్తను కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News January 4, 2026

మెదక్: టెట్ పరీక్ష ప్రశాంతం: డీఈవో విజయ

image

మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతకు టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో విజయ తెలిపారు. ఆదివారం రెండో రోజులో భాగంగా మొదటి పేపర్‌కు 100, రెండో పేపర్‌కు 100 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా మొదటి పేపర్‌కు 48 మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 71 మంది హాజరైనట్లు చెప్పారు. 81 మంది గైర్హాజరయ్యారన్నారు.

News January 4, 2026

అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం

image

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసభ్యకరమైన భాష, అబద్ధాల వరదతో ప్రజాస్వామ్య దేవాలయాన్ని అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్ న్యాయపోరాట ఫలితాలను సీఎం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇరిగేషన్ అంశాల్లో సీఎం అజ్ఞానం బయటపడిందని పేర్కొంటూ చేసిన ఆరోపణలకు పూర్తి సాక్ష్యాలతో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీలో సమాధానం ఇస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.