News August 13, 2024

మెదక్: ‘అత్తారింటికి అని వెళ్లిన కొడుకు తిరిగి రాలేదు’

image

తన కొడుకును వెతికి పెట్టాలని మెదక్ మండలం మగ్దూంపూర్ గ్రామానికి చెందిన బండలకాడి పోచయ్య సోమవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మురళి వివరాల ప్రకారం.. పోచయ్య కొడుకు చిన్నకృష్ణ ఈనెల 8న అత్తవారింటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదని, తన కొడుకు ఆచూకీ వెతికి పెట్టాలని తండ్రి ఫిర్యాదుతో  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 4, 2025

వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

image

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

News December 4, 2025

మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.