News February 18, 2025

మెదక్: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

image

అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైనట్టు మెదక్ సీఐ నాగరాజు తెలిపారు.  మెదక్ పట్టణానికి చెందిన మంగలి రేణుక ప్రైవేట్ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుంది. ఆమె కనిపించకపోవడంతో గత నెల 8న మిస్సింగ్ కేసు నమోదైంది. రేణుక మృతదేహం చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టామని త్వరలోనే కేసు వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

Similar News

News March 12, 2025

మెదక్: పనులు సక్రమంగా జరిగేలా చూడాలి: కలెక్టర్

image

రిజిస్ట్రేషన్‌, ధరణి ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. కౌడిపల్లి మండలం తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. భద్రపరిచిన రికార్డులు, వీడియో కాన్ఫరెన్స్‌, రిజిస్ట్రేషన్‌ గదులను పరిశీలించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని, ధరణి పనితీరును పరిశీలించారు. సర్వర్‌ ఎలా పనిచేస్తుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News March 12, 2025

మెదక్: హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండుగను కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంస్కృతి అద్దం పట్టేలా జరుపుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి జరిమానాలకు, రోడ్డు ప్రమాదాలకు గురై జైలు పాలు కావద్దని సూచించారు. హోలీ పండగ వేళ మన తోటి ఆడపడుచులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని తెలిపారు.

News March 12, 2025

కౌడిపల్లి: ఈనెల 17 నుంచి తునికి నల్ల పోచమ్మ జాతర

image

కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ దేవస్థానం జాతర ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 17న ధ్వజారోహణం, అభిషేకం, గణపతి పూజ, 18న అగ్నిగుండాలు, బోనాలు, 19న బండ్లు తిరుగుట, 20న పాచి బండ్లు, పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

error: Content is protected !!