News February 18, 2025

మెదక్: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

image

అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైనట్టు మెదక్ సీఐ నాగరాజు తెలిపారు. మెదక్ పట్టణానికి చెందిన మంగలి రేణుక ప్రైవేట్ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుంది. ఆమె కనిపించకపోవడంతో గత నెల 8న మిస్సింగ్ కేసు నమోదైంది. రేణుక మృతదేహం చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టామని త్వరలోనే కేసు వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

Similar News

News April 12, 2026

MDK: సాసర్ పిట్స్‌తో దాహం తీర్చుతున్న అటవీ శాఖ

image

మెదక్ జిల్లాలో ఎండల తీవ్రతతో అడవుల్లో వాగులు ఎండిపోవడంతో వన్యప్రాణులు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ‘సాసర్ పిట్స్’ (సిమెంట్ కుంటలు) జంతువులకు ప్రాణాధారంగా మారాయి. కెమెరా ట్రాప్‌లలో చిరుతలు, జింకలు నీరు తాగుతున్న దృశ్యాలు నమోదవుతున్నాయి. ఈ కుంటలు జంతువులు గ్రామాల వైపు రాకుండా అడ్డుకుంటూ రక్షణ కల్పిస్తున్నాయి. అధికారులు నిరంతరం నీరు నింపుతూ పర్యవేక్షిస్తున్నారు.

News April 12, 2026

మార్నింగ్ నుంచి హుషారుగా ఉండాలంటే..

image

*నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం ఉత్తేజమవుతుంది. జీర్ణ సమస్యలు తొలగుతాయి.
*రోజూ 20-30 ని.ల పాటు యోగా, వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
*పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం తీసుకుంటే శక్తి లభిస్తుంది. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
*ఎండలో కాసేపు గడపడం వల్ల విటమిన్ D అందుతుంది.
*పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాలి.

News April 12, 2026

అనంత: బాలికపై తండ్రి అత్యాచారయత్నం

image

మద్యం మత్తులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం(D) బిక్కరాయసముద్రం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. ఇంటర్ చదువుతున్న బాలికపై శుక్రవారం రాత్రి తండ్రి అఘాయిత్యానికి యత్నించడంతో కేకలు వేసింది. తల్లి రావడంతో అతడు పారిపోయాడు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, బాలికను సంరక్షణా గృహానికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.