News February 18, 2025

మెదక్: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

image

అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైనట్టు మెదక్ సీఐ నాగరాజు తెలిపారు.  మెదక్ పట్టణానికి చెందిన మంగలి రేణుక ప్రైవేట్ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుంది. ఆమె కనిపించకపోవడంతో గత నెల 8న మిస్సింగ్ కేసు నమోదైంది. రేణుక మృతదేహం చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టామని త్వరలోనే కేసు వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

Similar News

News March 28, 2025

సంగారెడ్డిలో మరో విషాదం..

image

SRD జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మృతులను UPకి చెందిన బైద్యనాథ్ భట్, ఒడిశావాసి హరిసింగ్‌గా గుర్తించారు. పైడిగుమ్మల్‌లోని వెంచర్‌లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

News March 28, 2025

మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. చేగుంట 40.0, నిజాంపేట్, హవేలిఘనపూర్ 39.9, కౌడిపల్లి 39.8, చిలపిచెడ్, నర్సాపూర్, కుల్చారం 39.7, పెద్దశంకరంపేట్, మెదక్ 39.6, అల్లాదుర్గ్ 39.5, రేగోడ్ 39.4, వెల్దుర్తి 39.2, పాపాన్నపేట్ 39.1, టేక్మాల్ 38.8°Cల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News March 28, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన తల్లి..

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు ఓ తల్లి విషం ఇచ్చి తానూ సేవించింది. కాగా, విషం తాగిన తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. మృతులు.. గౌతమ్(8), సాయికృష్ణ(12), మధుప్రియ(10). మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!