News December 29, 2024
మెదక్: అనారోగ్యంతో భార్య ఆస్పత్రికి.. భర్త సూసైడ్

శివంపేట మండలం కొంతాన్‌పల్లి గ్రామంలో భార్య అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా.. భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన గున్నాల అశోక్ గౌడ్(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శ్యామల అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లడంతో ఇంటివద్ద ఒంటరిగా ఉన్న అశోక్ గౌడ్.. శనివారం రాత్రి ఉరేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 17, 2025
మెదక్: రుణదాతల వేధింపులతో వ్యక్తి సూసైడ్

అప్పు ఇచ్చినవారు వేధించడంతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని కువత్ ఇస్లాంకు చెందిన మహమ్మద్ షాదుల్లా హుస్సేన్ (45) పట్టణంలో పోస్ట్ ఆఫీస్ సమీపంలో టీ స్టాల్ నడుపుతూ జీవిస్తున్నాడు. రూ.30 లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు వేధించడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఫాతిమా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 17, 2025
MDK: గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

చిన్నశంకరంపేట మండలం జంగరాయి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గుండెపోటుతో అస్పత్రిలో చేరిన సంజీవరెడ్డి మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు అస్పత్రిలో చేరారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News December 17, 2025
మెదక్: నాడు భర్త ఉప సర్పంచ్.. నేడు భార్య సర్పంచ్

గత ఎన్నికలలో గెలిచి భర్త పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా సేవలు అందించగా నేడు భార్య సర్పంచ్‌గా గెలిచి సేవలు అందించనున్నారు. మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారంలో సర్పంచ్‌గా చింతకింది దివ్య గెలుపొందారు. ఒకే కుటుంబంలో భర్త, భార్య గెలిచి నిలిచారు.


