News July 14, 2024
మెదక్: ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం

సైబర్ నేరగాళ్ల వలలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మోసపోయిన ఘటన అమీన్పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. అమీన్పూర్ పరిధిలోని గ్రీన్ విడోస్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి మే 19న ఆన్లైన్ ట్రేడింగ్కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. లింక్ ఓపెన్ చేసి రూ.6.49లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు లాభాలు ఇవ్వాలని అడగ్గా స్పందించలేదు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 20, 2025
MDK: చుక్కా రామయ్యకు శతవసంత శుభాకాంక్షలు: హరీష్ రావు

ప్రముఖ విద్యావేత్త ఐఐటీ రామయ్యగా పేరుపొందిన చుక్కా రామయ్య వందవ ఏట అడుగు పెట్టిన సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శతవసంత శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదిలో ఐఐటీ పాఠాలు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి మేథో దిక్సూచి అయిన మహోన్నతుడు ఆయన అని అన్నారు. అక్షరం ఆయుధం, నిరాడంబరత ప్రతిరూపం, క్రమశిక్షణకు మారుపేరు అయిన రామయ్య దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.
News November 20, 2025
మెదక్: 30లోగా దరఖాస్తు చేసుకోండి!

2025-26 సంవత్సరానికిగాను జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం ఆన్లైన్ ప్రతిపాదనలను కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రమేష్ సూచించారు. http://youth.yas.gov.in/scheme/npyad/ngo/login దరఖాస్తులు మాత్రమే అంగికరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.