News July 13, 2024
మెదక్: ఆరుక్వింటాళ్ల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు స్వాధీనం

కంది మండలం జుల్కల్‌లో ఆరు క్వింటాళ్ల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ అశోక్ తెలిపారు. కంది మండలం ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్ కుమార్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ తనిఖీల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు బయటపడినట్లు చెప్పారు. నకిలీ అల్లం పేస్టును సీజ్ చేసినట్లు తెలిపారు.
Similar News
News December 9, 2025
MDK: ఎన్నికల అధికారి కారు, ఆటో ఢీ.. మహిళ మృతి

నార్సింగి మండలం వల్లూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ఇన్నోవా కారు ఆటోను ఢీ కొట్టడంతో జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న ఓ మహిళకు తాకింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆటోను ఢీ కొట్టిన ఇన్నోవా కారు నిర్మల్ ఎన్నికల అబ్జర్వర్‌దిగా తెలుస్తుంది.
News December 9, 2025
మెదక్: కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కలెక్టర్ దూరం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించారు. ముందుగా కలెక్టర్ల చేతుల మీదుగా విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్నందున మెదక్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీలు దూరంగా ఉన్నారు. దీంతో డీఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ముగించారు.
News December 9, 2025
మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.


