News July 13, 2024

మెదక్: ఆరుక్వింటాళ్ల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు స్వాధీనం

image

కంది మండలం జుల్కల్‌లో ఆరు క్వింటాళ్ల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ అశోక్ తెలిపారు. కంది మండలం ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్ కుమార్,  ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ తనిఖీల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు బయటపడినట్లు చెప్పారు. నకిలీ అల్లం పేస్టును సీజ్ చేసినట్లు తెలిపారు.

Similar News

News October 13, 2024

మెదక్‌లో ఈనెల15న టేబుల్ టెన్నిస్ ఎంపికలు

image

మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోషియేషన్ ఆద్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి టోర్నమెంట్ ఈనెల 15న సెలక్షన్స్ (ఎంపిక పోటీలు) గుల్షన్ క్లబ్ మెదక్లో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డా. కొక్కొండ ప్రభు తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాలలో బాల, బాలికలకు ఓపెన్ కేటగిరిలో స్త్రీ, పురుషులకు పోటీలుంటాయని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు పుట్టిన తేదీ దృవ పత్రాలతో డి.రవితేజ, అనిష్‌లను సంప్రదించాలని సూచించారు.

News October 13, 2024

సిద్దిపేట: ‘అందరికి శుభం జరగాలి’

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్, రంగాధంపల్లి, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో దసరా వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. విజయ దశమి అంటే చెడుపై మంచి విజయం సాధించడమని అన్నారు. ఈరోజు పాల పిట్టను చూస్తే మంచి జరుగుతుందని, అందరికి శుభం జరగాలని ఆకాంక్షించారు.

News October 12, 2024

సిద్దిపేట: విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

పండగపూట సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. నంగునూర్ మండలం మగ్ధుమ్‌పూర్‌కు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నాగరాజు(32) శుక్రవారం రాత్రి బైక్‌పై వెళ్తూ సిద్దిపేటలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నేడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.