News April 13, 2025
మెదక్: ఆసుపత్రుల్లో తాగు నీటిని ఉంచాలి: మంత్రి

అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బందికి తాగు నీరు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాగు నీటి సౌకర్యం, వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లపై మంత్రి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News December 9, 2025
తూ.గో: విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.
News December 9, 2025
భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు

వరంగల్ భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్ల బాగోతం బయటకు వచ్చింది. ఇద్దరు ఉద్యోగులు ఒకే సీరీస్ నంబర్లున్న టికెట్లను భక్తులకు విక్రయించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాజీపేటకు చెందిన భక్తుడు నకిలీ టికెట్లు ఉన్నాయంటూ ఆలయం ఈవో రామల సునీతకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆలయ బోర్డులో చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు. నకిలీ టికెట్ల విక్రయం భద్రకాళి ఆలయంలో చర్చనీయాంశమైంది.
News December 9, 2025
చివ్వెంలలో తెల్లవారుజామున భారీ పేలుడు

చివ్వెంల మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. బ్రిక్స్ యూనిట్లోని పీడన ఫోమ్ తయారీ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగిందని స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దం భారీగా ఉండడంతో సమీపంలోని బీబీగూడెం, మున్యా నాయక్ తండా ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు తండోపతండాలుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.


