News March 5, 2025

మెదక్: ఇంటర్మీడియట్ పరీక్షల సరళి పరిశీలన చేసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల, టీజీఆర్ఎస్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, స్క్రైబ్ విధానం గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 6, 2025

మెదక్: ఇంటర్ విద్యార్థులారా.. ఇది మీ కోసమే..!

image

ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని మెదక్ జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్‌లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్‌లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.

News March 6, 2025

పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

News March 6, 2025

MDK: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

image

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.

error: Content is protected !!