News January 28, 2025
మెదక్: ఇంటర్ ప్రయోగ పరీక్షలు పటిష్ఠగా నిర్వహించాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, సంబంధిత అధికారులతో కలిసి జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించడంపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 6,660 మంది ఫస్ట్ ఇయర్, 6418 మంది సెకెండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం 12,484 మంది ప్రయోగ పరీక్షకు హాజరు కానున్నారు.
Similar News
News February 18, 2025
మెదక్: కోతి చేష్టలు.. షార్ట్ సర్య్కూట్‌తో ఇల్లు దగ్ధం

కోతులు కరెంట్ వైర్లను ఊపడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు దగ్ధమైన ఘటనలో రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు పేర్కొన్నారు. మెదక్ పట్టణం కుమ్మరిగడ్డలో ల్యాబ్ టెక్నీషియన్ కుమ్మరి సంతోష్ ఇల్లు సోమవారం షార్ట్ సర్య్కూట్‌తో ఖాళిపోయిన విషయం తెలిసిందే. మెడికల్ ల్యాబ్ ఏర్పాటు కోసం సమకూర్చుకున్న రూ.4 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు, సామాగ్రి, సర్టిఫికెట్‌లు కాలి బూడిదయ్యాయి.
News February 18, 2025
20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం.. వెంటనే నోటిఫికేషన్లు: మంత్రి

20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసి 25 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాదులోని టూరిజం కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్ ఇవ్వమని సీఎం చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేసి 25 వేల ఉద్యోగం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు.
News February 18, 2025
మెదక్: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైనట్టు మెదక్ సీఐ నాగరాజు తెలిపారు. మెదక్ పట్టణానికి చెందిన మంగలి రేణుక ప్రైవేట్ ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుంది. ఆమె కనిపించకపోవడంతో గత నెల 8న మిస్సింగ్ కేసు నమోదైంది. రేణుక మృతదేహం చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టామని త్వరలోనే కేసు వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.