News March 1, 2025
మెదక్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఇంటర్ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గురుకుల పాఠశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న కిషోర్ తన కూతురిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నారు. శివరాత్రి పండుగకు వచ్చిన విద్యార్థి తిరిగి వెళ్లేందుకు ఇష్టం లేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 3, 2025
సంగారెడ్డి: తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్‌లోని దివినో విల్లాస్‌లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.
News March 3, 2025
MDK: ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ

ఉమ్మడి MDK, ADB, KNR, NZB పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. అధికారులు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు, ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు సిద్ధం చేశారు. లెక్కింపునకు 2 నుంచి 3 రోజలు పట్టే అవకాశం ఉన్నందున షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించారు. ఆ ఇద్దరు విజేతలు ఎవరో చూడాలి.
News March 3, 2025
MDK: మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు.