News March 23, 2025
మెదక్: ఇంటర్ విద్యార్థి MISSING

మెదక్ జిల్లా శివంపేట మండలం దంతాన్ పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. దంతాన్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల రేవంత్ కుమార్ (17) శనివారం పొలం వద్దకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్ఐ వివరించారు. మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి గొల్ల మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News March 29, 2025
చరిత్రకు వారధులు కవులు: నందిని సిధారెడ్డి

చరిత్రకు వారధులు కవులు అని, చరిత్ర భావి తరాలకు తెలియాలంటే కవుల కలాలు కదిలించాలని తెలంగాణ తెలుగు సాహిత్య అకాడమి మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో గల తెలంగాణ భవన్ లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. సిధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని ఉద్యమాల్లో కవితోద్యమం ఎంతో గొప్పది అన్నారు.
News March 28, 2025
సంగారెడ్డిలో మరో విషాదం..

SRD జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మృతులను UPకి చెందిన బైద్యనాథ్ భట్, ఒడిశావాసి హరిసింగ్‌గా గుర్తించారు. పైడిగుమ్మల్‌లోని వెంచర్‌లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.
News March 28, 2025
మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. చేగుంట 40.0, నిజాంపేట్, హవేలిఘనపూర్ 39.9, కౌడిపల్లి 39.8, చిలపిచెడ్, నర్సాపూర్, కుల్చారం 39.7, పెద్దశంకరంపేట్, మెదక్ 39.6, అల్లాదుర్గ్ 39.5, రేగోడ్ 39.4, వెల్దుర్తి 39.2, పాపాన్నపేట్ 39.1, టేక్మాల్ 38.8°Cల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.