News March 23, 2025
మెదక్: ఇంటర్ విద్యార్థి MISSING

మెదక్ జిల్లా శివంపేట మండలం దంతాన్ పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. దంతాన్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల రేవంత్ కుమార్(17) శనివారం పొలం వద్దకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్ఐ వివరించారు. మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి గొల్ల మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఏర్పాటుకు కృషి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో మెదక్ జిల్లాలోనూ వీటి ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,617 చెరువులు, 105 చెక్ డ్యాములు, మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. 2 లక్షల 67 వేల ఎకరాల సాగుభూమి ఉంది, వీటికి సంఘాలు ఏర్పాటు చేయడంతో చెరువుల సంరక్షణ, సాగునీటి పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు రాజకీయ నిరుద్యోగులు సైతం తగ్గిపోయే అవకాశం ఉంది.
News October 28, 2025
మెదక్ జిల్లాకు కొత్తగా ఏడుగురు ఎంపీడీవోలు

మెదక్ జిల్లాకు కొత్తగా ఏడుగురు ఎంపీడీవోలు నియామకం అయ్యారు. జెడ్పీలో రిపోర్ట్ చేసిన అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిశారు. కొత్తగా కేటాయించిన వారు ఎంపీడీఓలుగా తూప్రాన్-శాలిక తేలు, నార్సింగి-ప్రీతి రెడ్డి, హవేలీఘన్పూర్-
వలుస శ్రేయంత్, చిలిపిచేడ్- బానోత్ ప్రవీణ్, అల్లాదుర్గ్- వేద ప్రకాశ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సీఈఓ ఎల్లయ్య ఉన్నారు.
News October 28, 2025
ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఐఈఓ మాధవి

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి(డీఐఈఓ) మాధవి సూచించారు. సోమవారం ఆమె వెల్దుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, తరగతి గదులను పరిశీలించారు. ఫిబ్రవరిలో జరగనున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.


