News May 19, 2024
మెదక్: ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ ఆత్మహత్య

మనస్తాపం చెందిన ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లి మృతదేహంగా లభ్యమైంది. కొల్చారం ఎస్ఐ మహ్మద్‌గౌస్ తెలిపిన వివరాలు.. మెదక్ పట్టణం నవాబుపేటకు చెందిన మల్లయ్య, రాజమ్మ దంపతులకు ఒక్క కుమార్తె సుజాతను రాజయ్య అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈనెల 16న తల్లి రాజమ్మ, సుజాతలకు గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంజీరా నదిలో శవం లభ్యమైంది. భర్త రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదైందని ఎస్సై తెలిపారు.
Similar News
News December 4, 2025
వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
News December 4, 2025
మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.