News February 3, 2025
మెదక్: ఇండియా పోలీస్ సౌత్ జోన్ క్రీడలకు కానిస్టేబుల్ ఎంపిక

1వ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ క్రీడలకు మెదక్ కానిస్టేబుల్ ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రికెట్ టీం ఎంపికలో 33 జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు దాదాపు 250 మంది పాల్గొన్నారు. అందులో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ సాయి కుమార్ ఎంపిక కాగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎఎస్పీ మహేందర్ అభినందించారు.
Similar News
News February 12, 2025
తూప్రాన్: చెరువులో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

తూప్రాన్ పెద్ద చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాంద్ పాషా, పర్వీన్ కుమార్తె జుబేరియా(6) బుధవారం ఉదయం తల్లితో కలిసి పెద్ద చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా మెట్లపై ఆడుకుంటున్న జుబేరియా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 12, 2025
మెదక్: 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు

మెదక్ జిల్లాలో 21 మండలాల్లో జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈనెల 15న ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయనున్నారు. జిల్లాలో పురుషులు 2,52,279 మంది, మహిళలు 2,71,878 మంది, ఇతరులు 9 మంది మొత్తం 5,23,966 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల కోసం 70 కేంద్రాల్లో 91 మంది ఆర్ఓలు, జడ్పీటీసీ ఎన్నికల కోసం 21+4 రిటర్నింగ్ అధికారులుగా జిల్లా అధికారులను నియమించారు.
News February 12, 2025
మెదక్: అప్పులతోనే ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య

మెదక్ పట్టణంలో ప్రముఖ వ్యాపారి మల్లికార్జున రమేష్ (54) మంగళవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. రమేశ్ పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఈ సూపర్ మార్కెట్ ద్వారా 100 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారంలో అప్పులు రూ.కోట్లలో పేరుకుపోయాయి. వాటిని తీర్చే మార్గం లేక ఇంటిపై గల పెంట్ హౌస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.