News March 23, 2025

మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

image

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 27, 2025

మెదక్: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ మండలంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. బిహార్‌లోని బాక్సర్ జిల్లా, సిమారికి చెందిన కమలేష్ కుటుంబంతో కలిసి కాళ్లకల్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య మమత ఇద్దరు పిల్లలు కలరు. వెల్డింగ్ వర్క్ చేసుకుంటా జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News March 27, 2025

MDK: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం MDK, SRD, SDPT డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

News March 27, 2025

మెదక్: నేడే ఆఖరు.. సబ్సిడీపై సాగు పరికరాలు

image

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోందని, నేడే చివరి తేది అని అధికారులు తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024-25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం రాయితీ ఉంటుందన్నారు.

error: Content is protected !!