News April 29, 2024
మెదక్: ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విత్ డ్రా

మెదక్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సోమవారం విత్ డ్రా చేసుకున్నారు. సదాశివపేటకు చెందిన తుమ్మలపల్లి పృథ్వీరాజ్(తెలంగాణ మంజీరా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు), సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూర్ గ్రామానికి చెందిన కపిల్ భద్రేశ్ విత్ డ్రా చేసుకున్న వారిలో ఉన్నారు. మొత్తం 53 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 13, 2026
తూప్రాన్: తల్లిదండ్రులకు విజయాన్ని అంకితం చేసిన శ్రావణి

తూప్రాన్ ఎంజేపీ బాలికల కళాశాల విద్యార్థిని శ్రావణి ఇంటర్ ఎంపీసీలో 950 మార్కులతో సత్తా చాటింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. పట్టుదలతో చదివి ఈ విజయం సాధించింది. టెన్త్ బోనాల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసిన శ్రావణి.. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్‌లో రాణించింది. తన విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని శ్రావణి పేర్కొంది.
News April 13, 2026
మెదక్: RJCలో 100% ఉత్తీర్ణత.. స్టేట్ టాపర్ శ్రావణి

మెదక్ TSRJC విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించారు. పరీక్షలకు హాజరైన మొత్తం 68 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో మన్నే శ్రావణి ఎంపీసీ విభాగంలో 992/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి టాపర్‌గా నిలిచింది. విద్యార్థుల అద్భుత ప్రతిభపై అధికారులు, టీచర్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ విద్యాలయాల ఖ్యాతిని శ్రావణి మరోసారి చాటిచెప్పింది.
News April 12, 2026
మెదక్: ఒకేషనల్ ఫస్టియర్ ఫలితాల్లో జిల్లా టాప్

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఒకేషనల్ ఫలితాల్లో మెదక్ జిల్లా టాపర్‌గా నిలిచినట్లు ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. 599 మంది పరీక్షకు హాజరుకాగా 73.46% గా 440 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. 289 మంది బాలురకు 59.17 శాతంగా 171 మంది ఉత్తీర్ణత సాధించారు. 310 మంది బాలికలకు 86.77 శాతంగా 269 మంది ఉత్తీర్ణత సాధించారు.


