News June 25, 2024
మెదక్: ఈనెల 28న జిల్లాస్థాయిలో ఎంపిక పోటీలు

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మెదక్ అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు ఆవిష్కరించారు. 28న మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లాస్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9347344440, 9493594388 నంబర్లును సంప్రదించాలని సూచించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు, శ్రీనివాస్, మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డి ఉన్నారు.
Similar News
News February 8, 2025
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ చేగుంట ప్రధాన రహదారిపై చెట్ల నర్సంపల్లి సమీపంలో అతివేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 8, 2025
మెదక్: మొదలైన భానుడి భగభగలు..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుణుడి ప్రతాపం ప్రారంభమైంది. ఎండలు అప్పుడే దంచి కొడుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో చలి తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు తమ ఇంట్లోని కూలర్లు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, ఫ్యాన్లు మొదలైన విద్యుత్ ఉపకరణాలను బయటకు తీసి రీపేర్లు చేయించుకుంటున్నారు. మరోవైపు ఎండలు ముదురుతుండడంతో రోడ్లపై జ్యూస్ షాపులు వెలుస్తున్నాయి.
News February 8, 2025
మెదక్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. మెదక్ జిల్లాలో 493 గ్రామపంచాయతీలుండగా, మొత్తం 5,25,478మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,52,797మంది, మహిళలు 2,72,672మంది ఉన్నారు. ఇతరులు 9మంది ఉన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను అనుసరించి తాజాగా గ్రామపంచాయతీ ఓటర్ జాబితాను అధికారులు సిద్ధం చేశారు.