News February 13, 2026
మెదక్: ఉత్కంఠ.. 6 ఓట్లతో WIN

మెదక్ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్‌గా అవారీ రాజశేఖర్ బీఆర్ఎస్ కేవలం ఆరు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుందేటి శేఖర్‌పై విజయం సాధించారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగింది. ఓట్లు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
జిల్లాలో బాపట్ల మండలం అత్యధికం

బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద అత్యధికంగా బాపట్ల మండలంలో రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు. బాపట్ల మండలంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 11,275 మందికి రూ.4.51 కోట్లు, పీఎం కిసాన్ పథకం ద్వారా 8,811 మందికి 1.76 కోట్లు నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు. మొత్తంగా 6.27 కోట్ల రూపాయలు నిధులు శుక్రవారం నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయన్నారు.
News March 13, 2026
ఆర్మూర్: 68 గ్యాస్ సిలిండర్లు సీజ్

ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాడుతున్న 31 సెంటర్లను గుర్తించి, మొత్తం 68 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
News March 13, 2026
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను ఇలా గుర్తించండి

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.


