News April 25, 2024

మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక కౌన్సిలర్ నామినేషన్

image

మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య నామినేషన్ దాఖలు చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలల్లో ఏఐఎఫ్‌బీ పార్టీ తరుపున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు. గెలిచిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ మెదక్ ఎంపీగా నామినేషన్ వేయడం పట్ల పార్టీలో చర్చనీయాంశమైంది.

Similar News

News February 27, 2026

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

image

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

News February 27, 2026

మెదక్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

మెదక్ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు. గతంలో తాను అదనపు కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు అందించిన సహకారాన్ని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. అదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.

News February 27, 2026

మెదక్: కలెక్టర్‌‌ను కలిసిన ఎస్పీ

image

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను వివరించారు.