News February 15, 2025
మెదక్: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News March 28, 2025
సంగారెడ్డి: ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన తల్లి..

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు ఓ తల్లి విషం ఇచ్చి తానూ సేవించింది. కాగా, విషం తాగిన తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. మృతులు.. గౌతమ్(8), సాయికృష్ణ(12), మధుప్రియ(10). మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
మెదక్: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య !

మెదక్ పట్టణం గాంధీ నగర్లో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహమ్మద్ ఫారుక్(32) తన రేకుల ఇంటిలోనే ఉరివేసుకున్నట్లు కుటుంబీకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తోన్నారు.
News March 28, 2025
మెదక్: ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి వీడ్కోలు

ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన మెదక్ జిల్లాకు చెందిన శేరి సుభాష్ రెడ్డి గురువారం పదవి వీడ్కోలు పొందారు. హవేలిఘనపూర్ మండలం కూచన్పల్లికి చెందిన శేరి సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి గులాబీ పార్టీలో పనిచేశారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన సుభాష్ రెడ్డికి ఆరు సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నేటితో పదవి ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ సత్కరించారు.