News August 16, 2024
మెదక్: ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు సెప్టెంబర్-11 వరకు గడువు

పేద విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఎన్ఎంఎంఎస్ రాత పరీక్ష విధానంలో జాతీయ ఉపకార వేతనాలు అందిస్తోంది. ఉపకార వేతనాలు పొందడానికి 8వతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థులు bsc.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నకలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించాలి. ఎంపికైన విద్యార్థులకు 9-12వ తరగతి వరకు ఏటా12 వేల చొప్పున 48వేల ఉపకారవేతనం అందుతాయి.
Similar News
News November 1, 2025
నర్సాపూర్: ‘ఎకో పార్కు, చెరువు డంపింగ్ యార్డ్ కావద్దు’

నర్సాపూర్ శివారులో నిర్మించిన నూతన ఎకో పార్కు చెరువు డంపింగ్ యార్డ్ కావద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నర్సాపూర్ శివారులో నూతనంగా నిర్మించిన ఎకో పార్కును మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్లతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఆయా శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు.
News November 1, 2025
మెదక్: బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలు వీరే..

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్లో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలు వీరే. ఓపెన్ కేటగిరీలో డా. కార్తీక్, నాగవర్ధన్ జోడీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగేంద్ర 2వ స్థానంలో నిలిచారు. 40ఏళ్లు పైబడిన విభాగంలో ప్రవీణ్, అశ్విన్లు విజేతలుగా నిలిచారు. మహిళా విభాగంలో వీణ, మౌనిక జోడీ ప్రథమ స్థానంలో నిలిచారు. త్వరలో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
News October 31, 2025
మెదక్: ‘మహిళల, బాలికల భద్రతకే షీ టీమ్స్’

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. వేధింపులకు గురైనవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలలో జిల్లాలో 17 ఎఫ్ఐఆర్లు, 13 ఈ-పిటి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 88 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.


