News August 16, 2024
మెదక్: ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు సెప్టెంబర్-11 వరకు గడువు
పేద విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఎన్ఎంఎంఎస్ రాత పరీక్ష విధానంలో జాతీయ ఉపకార వేతనాలు అందిస్తోంది. ఉపకార వేతనాలు పొందడానికి 8వతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థులు bsc.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నకలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించాలి. ఎంపికైన విద్యార్థులకు 9-12వ తరగతి వరకు ఏటా12 వేల చొప్పున 48వేల ఉపకారవేతనం అందుతాయి.
Similar News
News September 21, 2024
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహశీల్దార్లదే: సంగారెడ్డి కలెక్టర్
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహశీల్దార్లదేనని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవోలు పాల్గొన్నారు.
News September 21, 2024
తిరుమల లడ్డూ కల్తీపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ రఘునందన్
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం దారుణమని, బాధ్యులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.ఈ మేరకు ఎంపీ Xలో పోస్టు చేశారు. పవిత్రతకు మారుపేరైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ చేయడం క్షమించరాని నేరం అన్నారు. 2019 నుంచి 2024 వరకు తిరుమలలో జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి చర్యలు తీసుకోవాలన్నారు.
News September 21, 2024
నర్సాపూర్: ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’
జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు రాజీ చేయదగ్గ కేసులను రాజీ కుదురు కుదుర్చుకోవచ్చని నర్సాపూర్ న్యాయమూర్తి కే అనిత సూచించారు. నర్సాపూర్ కోర్టు ఆవరణలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పోలీస్ అధికారులు హాజరయ్యారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారీలు రాజి కుదుర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు.