News February 24, 2025
మెదక్: ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3 రోజులు మద్యం బంద్

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 3 రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు.
Similar News
News April 22, 2025
మెదక్: నేడే తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

జిల్లాలో మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. జిల్లాలో మొత్తం విద్యార్థులు 12,484 పరీక్షలు రాశారు. ఇందులో ఒకేషనల్ కలుపుకొని ప్రథమ సంవత్సరం 6,066 మంది, ద్వితీయ సంవత్సరం 6,418 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ మాధవి తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST
News April 22, 2025
మెదక్: రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా, మండల స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తులు ఈనెల 24 వరకు స్వీకరిస్తున్నట్లు మెదక్ డీఈఓ రాధా కిషన్ తెలిపారు. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ వారి ఆదేశానుసారం 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించి 28న ప్రకటిస్తారన్నారు.
News April 21, 2025
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించాలి: మంత్రి

వడదెబ్బ బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్ను మెడికల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు.