News February 26, 2025
మెదక్: ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: SP

మెదక్ జిల్లాలో ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు.
Similar News
News March 17, 2025
మెదక్: అగ్ని వీర్ కోసం యువత దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

యువత ఇండియన్ ఆర్మీలో చేరేందుకు అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని యువకులు ఇండియన్ ఆర్మీలో చేరి సేవలందించేందుకు ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఉందని అన్నారు. అగ్ని వీర్ కోసం ఈ నెల 12 నుంచి https://www.joinindianarmy.nic.in వెబ్ పోర్టల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 17, 2025
మెదక్: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు: డీఈవో

మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపాలని సూచించారు.
News March 17, 2025
సిద్దిపేట: దంపతుల ఆత్మహత్య.. అనాథలైన చిన్నారులు

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో దంపతులిద్దరూ ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. ఎల్లారెడ్డి పేటకు చెందిన కెమ్మసారం భాగ్యమ్మ (32) ఉదయం పురుగుల మందు తాగే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి మనస్థాపానికి గురైన భర్త నాగరాజు (35) సైతం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు మీనాక్షి (9), మహేష్(7), లక్కీ (5), శ్రావణ్ (4) అనాథలయ్యారు.